19-05-2025 03:01:30 PM
ముందు నీ పార్టీ సక్కదనం చూసుకో...
పెద్దపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో పుట్ట మధు జోక్యం ఎందుకని ముందుగా నీ పార్టీ సక్కదనం చూసుకో అని పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, విజయ రమణారావులు అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో తలదూర్చితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. మొదటినుంచి దళితులకు సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని, తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మీ నాయకుడు కేసీఆర్ పదేళ్లు ఏం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు.