calender_icon.png 23 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి టెలికాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

23-01-2026 12:44:51 AM

  1. పార్క్ భూమి ఆక్రమణపై చర్యలు 

నోటీసులు లేకుండా తొలగింపులంటూ బాధితుల ఆగ్రహం

శేరిలింగంపల్లి, జనవరి 22 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో హైడ్రా మరోసారి కూల్చివేతలకు దిగింది. గురువారం ఉదయం గచ్చిబౌలి టెలికాంనగర్లోని సర్వే నెంబర్ 91లో ఉన్న పార్క్ స్థలంలో అక్రమ ఆక్రమణలపై హై డ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజావాణిలో స్థానికులు చేసిన ఫిర్యాదుల మేర కు రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, సుమా రు 2000 గజాల మేర పార్క్కు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గుడిసెలను తొలగించారు. పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నివాసాలు ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ చర్యలపై బాధితులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. టెలికాం నగర్ సర్వే నెంబర్ 91 పరిధిలో పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా, చిన్నపాటి గుడిసెలనే లక్ష్యంగా చేసుకుని హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారని వారు ప్రశ్నించారు.

మరోవైపు, ఇది పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పార్క్ స్థలమని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నా రు. కూల్చివేతల నేపథ్యంలో టెలికాంనగర్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఈ చర్యలపై ఇంకా న్యాయపరమైన పోరాటానికి వెళ్లే అవకాశముందని బాధితులు చెబుతున్నారు.