calender_icon.png 1 November, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్క్ స్థలాన్ని రక్షించిన హైడ్రా

30-10-2025 01:41:46 AM

10 కోట్ల విలువైన పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు

కుత్బుల్లాపూర్, అక్టోబర్ 29(విజయక్రాంతి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, సర్వే నెంబర్ 93 నందు 20 గుంటల స్థలాన్ని పార్కుగా పేర్కొంటూ 2020 లో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మున్సిపల్ అధికారులు పార్కును అభివృద్ధి చేయకపోవడం వల్ల కొందరు కబ్జాదారులు రెండు నెలల క్రితం ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. కాలనీ వాసులు, ఆకుల సతీష్ టీం పార్క్ కబ్జాను అడ్డుకోవడంతో పాటు హైడ్రా కు ఫిర్యాదు చేశారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వుల మేరకు సీఐ నరేష్ ఆధ్వ ర్యంలో బుధవారం పార్క్ స్థలానికి ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ఈ సందర్భంగా పార్క్ స్థలాన్ని కాపాడినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మున్సిపల్ కమిషనర్ నిధులు కేటాయించి, అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తేవాలని కోరారు.