30-10-2025 01:42:26 AM
నిర్మల్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రం కంటి ఆసుపత్రి వద్ద భైంసా బాసర రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చిరుత హల్‌చల్ చేసింది. గత వారం రోజులుగా తాండూరు మండలంలో చిరుత సంచారిస్తున్నట్టు రైతులు పేర్కొనగా మంగళవారం రాత్రి రోడ్డుపై వాహనదారులకు చిరుత కనిపించింది.
రోడ్డు దాటుతుండగా కొందరు సెల్‌ఫోన్‌ల్లో చిరుత దృశ్యాలను బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్నఅటవీ శాఖ అధికారులు పాదము ద్రల ఆధారంగా చిరుతను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సమీప ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు.