25-09-2025 01:07:18 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తే అసైన్డ్ భూములు బయటకు వస్తాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల విలువ చేసే ఆస్తులను హైడ్రా రక్షించిందని తెలిపారు. కబ్జాకోరల్లో ఉన్న ఆస్తులను ప్రభుత్వం కాపాడుతుంటే ప్రతిపక్షాలు తట్టులేకపోతున్నాయ న్నారు. పేదళ్ల ఇళ్లు కూలగొడితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.