calender_icon.png 25 September, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

25-09-2025 01:07:00 AM

-ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల పై దృష్టి సారిస్తాం.

-జర్నలిస్టులు పరిశోధనాత్మక వార్తలపై దృష్టి సారించాలి 

-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ/భూపాలపల్లి సెప్టెంబర్ 24(విజయక్రాంతి):రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం వెనుకాడబోదని జర్నలిస్టుల ఇండ్ల ,హెల్త్ కార్డుల సమస్యలపై నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దద్ధిల్ల శ్రీధర్ బాబు అన్నారు.బుధవారం భూపాలపల్లి ఇల్లందు క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) 3 వ మహాసభ సీనియర్ జర్నలిస్టు, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిజం సమాజంలో గౌరవప్రదమైన వృత్తి అని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా జర్నలిజం పిలువ పడుతుందన్నారు.జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే ఒక పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. భూపాలపల్లి  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి అవసరమైన నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మెడికల్ హెల్త్ పాలసీ తో మెరుగైన వైద్య సేవలు అందేవని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్త్ కార్డుల వలన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఉద్యోగుల మాదిరిగా కొత్త హెల్త్ స్కీమును జర్నలిస్టులకు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, తెలంగాణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, తాటికొండ కృష్ణ ,రాష్ట్ర కార్య దర్శిలు చంద్రశేఖర్, రఘు ,బిక్షపతి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ తో పాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక...

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్లుజెఎఫ్)నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎర్రం సతీష్ కుమార్,కార్యదర్శిగా గుజ్జ సారేశ్వర్, కోశాధికారిగా మండల రాంబాబు  పాటు, ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి, కొండ్ర రమేష్, జాయింట్ సెక్రటరీలుగా టి. దుర్గయ్య, సామల ధనుంజయ,సుంకరి శ్రీధర్ పటేల్,  స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా చింతల కుమార్ యాదవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కొలుగూరి సంజీవరావు, లతో పాటు జిల్లా కమిటీ సభ్యులుగా ఎండి రహీం,నామాల రమేష్, కాట్రేవుల లచ్చయ్య,అంగడి గణపతి తదితరులు ఎన్నికయ్యారు. 

 తెలంగాణ బ్రాడ్  క్యాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక

తెలంగాణ బ్రాడ్  క్యాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీబిజెఎ) జిల్లా అధ్యక్షులుగా ఆకుతోట ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా బండి కమలాకర్, జిల్లా ఉపాధ్యక్షులుగా బొంగోని తిరుపతి, కోశాధికారిగా ఏనుగుల భాస్కర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా రొంటాల  శంకర్, లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.