calender_icon.png 15 October, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరికి వస్తున్న స్పందన ఆనందాన్నిస్తోంది

15-10-2025 01:19:27 AM

వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘అరి’. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో మూవీటీమ్ హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు వినోద్‌వర్మ మాట్లాడుతూ.. “అరిషడ్వర్గాల నేపథ్యంలో జయశంకర్ సినిమా రూపొందించిన చిత్రంలో లీడ్ రోల్‌లో నటించిన నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. “అరి’ మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందనుకున్నాం.

అయితే రెండోరోజే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్లను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.

థర్డ్ డే నుంచి మా సినిమా ఆడుతున్న థియేటర్లలో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు కానీ, వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం” అని చెప్పారు.