21-09-2025 01:16:54 AM
శ్రీనిధిశెట్టి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ. ‘కేజీఎఫ్’లో భాగం కావటం ద్వారా తొలిచిత్రంతోనే దేశవ్యాప్త గుర్తింపు పొందే భాగ్యం దక్కింది. యష్ సరసన నటించటం.. ఆ సినిమా విజయంతో శ్రీనిధి సినీప్రస్థానం బలమైన పునాది వేసుకుంది. కేజీఎఫ్ తర్వాత అవకాశాలెన్ని వరుస కట్టాయి. అయినా, ఎంపిక చేసేటప్పుడే చాలా జాగ్రత్తలు పాటిస్తూ తనదైన ప్రత్యేక పంథా కొనసాగిస్తోందీ అమ్మ డు. అందులో భాగంగానే కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే కోలీవుడ్‌లో అడుగుపెట్టిందీ భామ.
‘కోబ్రా’లో విక్రమ్‌కు జోడీగా నటించి, తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కా యి. ఇటు తెలుగులోనూ ‘హిట్3’లో హీరో నానితో కలిసి బలమైన ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో శ్రీనిధి చేసిన రెండోచిత్రం ‘తెలుసు కదా’. ఇందులో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయనుంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఇప్పుడీ అందాల నిధి మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న కొత్త ప్రాజె క్టులో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ఒక పాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నారని టాక్. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో సరసన నటించే అవకాశం దక్కడం పట్ల శ్రీనిధి కెరీర్‌లో మరో మైలురాయి చిత్రం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.