25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ‘ప్రజా సమస్యలపై, దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. నేను వార్నింగ్‌లకు భయపడను’ అని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. సిట్ కమిషనర్, సీపీ సజ్జనార్‌పై చే సిన ఆరోపణలకు ‘నా దగ్గర ఉన్న సమాచారంతో జవాబు ఇస్తా. తరువాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను వ్యక్తిగత దూషణలు చేయను.
చిల్లర భాషను వాడను. -వాస్త వాలు దాచను’ అని పేర్కొన్నారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి సజ్జనార్ నేతత్వంలో ఏర్పాటైన రెండో సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని ఖండించిన 12 గంటల లోపే ‘మా ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నాకు నోటీసు ఇచ్చారు’ అని ఆర్‌ఎస్పీ తెలిపారు.
ఈ వ్యవహారంపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఆధారాలతో సహా రిప్లు ఇవ్వకపోతే సివిల్, -క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారని వెల్లడించారు. సజ్జనార్ మీద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలి అని డి మాండ్ చేసినట్లుగా నోటీసులో ఉందని, ఇది వాస్తవ విరుద్ధమన్నారు.
గతంలో ఓటు కు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టీడీపీ ఎమ్మెల్యే, నేటి సీఎం రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం-ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్ర లో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయని గుర్తు చేశారు.
ఆ సమయంలో ఆంధ్రలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యిందని, అప్పుడు సజ్జనార్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభా గంలో అధికారిగా పనిచేశారనే అవగాహనతో ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్‌కు ఛీఫ్‌గా ఆయన ఉండడం కరక్టు కాదు అని నా అభిప్రాయం చెప్పానని వివరించారు. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తేవాల్సిన కనీస బాధ్యత నాపై ఉందన్నారు.