25-01-2026 12:00:00 AM
రూ.5 కోట్లతో నిర్మించిన మోడ్రన్ మార్కెట్
బాంబే కాలనీలో రూ. 2.47 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రైతు బజార్లకు భారతీనగర్ రైతు బజార్ ఆదర్శంగా నిలవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకాంక్షించారు. వినియోగదారులకు, రైతులకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దామన్నారు. శనివారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని భారతీనగర్‌లో రూ.5 కోట్ల వ్య యంతో నిర్మించిన అత్యాధునిక రైతు బజార్‌ను, బాంబే కాలనీలో రూ. 2 కోట్ల 47 లక్ష లతో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను మేయర్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎంఐజీలో రూ. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ భారతీనగర్ రైతు బజార్‌ను ఆధునిక హంగులతో, విశాలంగా నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడ మొత్తం 4 కేటగిరీలుగా షెడ్లను విభజించామన్నారు. ఒక్కో షెడ్‌లో 26 స్టాల్స్ చొప్పున ఏర్పాటు చేశామని వివరించారు. వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లే పనిలేకుండా, అన్ని రకాల సరుకులు ఒకే చోట దొరుకుతాయని మేయర్ తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు కూడా విశాలమైన స్థలం కేటాయించినట్లు చెప్పారు.
బాంబే కాలనీలో ప్రారంభించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్.. స్థానిక పేద, మధ్యతరగతి ప్రజల శుభకార్యాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేయర్ అ న్నారు. తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుపుకునేందుకు ఇది దోహదపడు తుందన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్‌ఎంసీ పెద్దపీట వేస్తోందని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ సి. అంజిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్‌సహదేవ్‌రావు, స్థానిక కార్పొరేటర్లు వి. సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.