14-07-2025 12:57:16 AM
-విద్యుత్ శాఖ ఎఈ సత్యం కు ఫోన్ చేసిన స్పందించట్లేదని రైతుల ఆవేదన
- విజయ క్రాంతి దినపత్రికకు సమాచారం అందించిన రైతులు
- మరమ్మతులు చేయిస్తాం : సత్యం, ఏఈ, మహమ్మదాబాద్ మండలం
మహమ్మదాబాద్ జూలై 13 : రైతుకు 24 గంటలు సాగు చేసేందుకు విద్యుత్ ను అందుబాటులో ఉంచుతున్నామని ప్రభు త్వం చెబుతూ వస్తుంది. ఇక్కడి వరకు బాగా నే ఉన్నా కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు విద్యుత్ వివిధ కారణలతో నిలిచిపోవడంతో ఆ సమస్యను పరిష్కరించడంలో మాత్రం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 23,24లాలో 12 ఎకరాల భూ మి నాలుగు మోటర్లు ఒక ట్రాన్స్ఫారం పై ఆధారపడి ఉంది. ఈ భూమిలో వరి సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే నారుమడి వేయడం జరిగింది. ఉన్నట్టుండి గత 15 రో జుల క్రితం అక్కడ ఉన్న విద్యుత్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఖాళీ పోయిందని చెప్పి కూడా పట్టించుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. నారు మడి కూడా ఎండిపోవలసిన దుస్థితి ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని విద్యు త్ శాఖ మహమ్మదాబాద్ మండలం ఏఈ సత్యంకు సమాచారం అందించినప్పటికీ ప్ర తిరోజు రేపు వస్తున్నానని చెప్పుకుంటూ కా లం గడుపుతున్నారని రైతులు విజయ క్రాం తి దినపత్రిక కు సమాచారం అందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఈ సత్యం వెంటనే స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని రైతులు కో రుతున్నారు.
24 గంటలు రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సేవలు అందించాల్సిన సంబంధిత అధికారులే ఇలా నిర్లక్ష్యంగా ఉండడంపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులైన ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి మేలు చేయాలని రైతులు అర్వ రమేష్, శ్రీను, రాజు కోరుతున్నారు.
- మరమ్మతులు చేయిస్తాం
జూలపల్లిలో ట్రాన్స్ఫారం పోయిందని సమాచారం ఇవ్వడం జరిగింది. సో మవారం రోజు ఈ సమస్యను పరిష్క రించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుందని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పనిచేయలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. రైతులకు పూర్తిస్థాయిలో సమాచారం అందించి వెంటనే ట్రాన్స్ఫారం మరమ్మతులు చేస్తాం.
సత్యం, విద్యుత్ శాఖ ఎఈ, మహమ్మదాబాద్ మండలం.