14-07-2025 12:58:11 AM
బీసీ ప్రజా ప్రతినిథుల ఫోరం
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): దేశంలో బీసీలకు చట్టబద్ధతలతోనే న్యాయం జరుగుతుందని, రాష్ర్టంలో గతంలో కూడా జీవో విడుదల చేస్తే హైకోర్టు కొట్టేసిందని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం నేతలు అన్నారు. సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించిందని, రాష్ర్టంలో జీఓ ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతున్నారని, ఇది మోసపూరి చర్య అని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ ఈశ్వరయ్య, నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్‌తో బీసీపీఎఫ్ ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. 42శాతం బీసీ రిజర్వేషన్, 9వ షెడ్యూల్‌లో ఇంక్లూడ్ చేస్తేనే తప్ప బీసీలకు న్యాయం జరగదని న్యాయమూర్తులు చెప్తున్నారని ఫోరం ప్రతినిధులు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
15వ తేదీన ఇందిరాపార్క్ వద్ద చేపట్టే బీసీ మహా ధర్నాకు వారిని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు కుమార్ గౌడ్, ప్రనీల్ చందర్ , సుర్వి యాదయ్య, దేవీ రవీందర్, సుప్ప ప్రకాశ్, వల్లూరు వీరేశ్ పాల్గొన్నారు.