06-01-2025 12:00:00 AM
నా అరచేతులు చూడండీ హైదరాబాద్ కనిపిస్తుంది! నేను నిలుచుంటే నిలువెత్తు చార్మినార్ దర్శనమిస్తుంది! ఇది ప్రేమతో ఫ్రేము కట్టుకొన్న మనసులాంటి నిలువుటద్దం!ఎందరం కలిసి చూసుకొన్నా ఒకే నవ్వులా వికసించే ప్రతిబింబం!ఎవరూ కొలనులో రాయి విసరకండి నీళ్ళలో కల్లోలం చెలరేగుతుంది! కొమ్మమీది పక్షులు బెదిరిపోయి గూడు అందం చెదిరిపోతుంది! నా కళ్ళల్లోకి చూడండీ నగరం నెమలిలా పురివిప్పింది!
కసిగా వంతెనను మోటుగా దాటి కూల్చకండీ నీవు తప్పి పోవద్దు నన్ను తోవ తప్పనీయద్దు కళ్ళమీద సుడిగాలి తిరిగీ మనం ఇంటిదారి మరిచిపోవద్దు ఇక్కడ పతంగుల ఆటలుండేవి కుస్తీల పోటీలుండేవి ఏనాడు మనుషుల మధ్యన స్నేహాలతో జూదాలు జరగలేదు హైదరాబాద్ ఒక కవిత దాన్ని చదువుతాను విను! వెదకడానికి వెనక వెనక వస్తున్న నా కన్నతల్లి పిలుపు విను!!
పక్కనే ఉన్న నెచ్చెలి, సతిగా ఇంట్లో కొలువుదీరినా పడతి అంతరంగం సాంతం తెలియడం అసాధ్యం చకచక మారే ఆ అంతరంగ మధురిమ ధన్యం సత్యమిదే తెలుసుకో మిత్రమా.
బుర్రా వెంకటేశం, ఐఏఎస్