calender_icon.png 18 August, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీమంత అయినా బ్రహ్మంత అహంకారం

06-01-2025 12:00:00 AM

అమ్= అందమైన, కణ్= విశాలం, మా= పెద్దదీ అయిన ఞాలత్తర్ శర్= ఈ భూమిని పాలించిన, అర్ శర్= రాజులం తా, అభిమాన భంగమాయ్= తమ అహంకారం విడిచి, వందు= వచ్చి, నిన్= నీ, పళ్లిక్కట్టి ల్ కీజే= మంచం కింద, శఙ్గం= సంఘములుగా, ఇరుప్పార్ పోల్= దాసులై ఉన్నట్టే, వ న్దు= వచ్చి తలైప్పెయ్ దోమ్= మేముకూడా వ చ్చి చేరిపోతిమి, కింగిణి= సిరిమువ్వ గజ్జెలవ లె, వాయ్ చ్చెయ్ ద= నోరు తెరిచినట్టు, తామరైప్పూప్పోలే= తామరపూవులవలె, శెమ్ కణ్= వాత్సల్యంతో ఎర్రనైన నేత్రాలను, శిణిచ్చిఱిదే= నెమ్మది నెమ్మదిగా కొద్దికొద్దిగా, ఎమ్మే ల్= మాపైన, విజియావో= ప్రసరింప చేయ వా, తింగళుం= చంద్రుడూ, అదిత్తియమం= సూర్యుడూ, ఎజన్దార్ పోల్= ఒకేసారి ఉదయించినట్టు చల్లని కాంతులీనుతూ, ఇరణ్డుం కొండు= రెంటిలోనూ, ఎంగళ్ మేల్= మాపై న, నొక్కుదియేల్= చూపినట్టయితే, ఎంగళ్ మేల్= మాపైనున్న, శాపమ్= పాపములన్నీ నశిస్తాయి, ఏల్ ఓర్ ఎం పావాయ్= ఇదే మా గొప్ప నోము.

‘నాకేమీ లేదు అంతా భగవానుడే’

చీమకు, బ్రహ్మకు కూడా అహంకారం స మంగానే ఉంటుందట. చీమకున్నంతలో చీమ అంతా తనదే అనుకుంటుంది. ‘నేను’ అనుభవిస్తున్నాననీ, నేనే’ చేస్తున్నానని అహంభావి స్తుంది. అయితే, బ్రహ్మకే లభించని మోక్షం చీమకు ఏ విధంగా లభిస్తుంది? బ్రహ్మ ముం దుగా తనకు విశాలమైన సంపద తనవల్లనే ఉందనుకుంటాడు. ఆ సంపదనంతా పరమాత్మకు సమర్పించి మోక్షం పొందాలని కోరు కుంటే, తన అత్యధిక సంపద అంతా సమర్పించడానికి చాలా సమయం పడుతుంది. ఆయ న కోరికను అనుసరించి ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. 

ఏమీ లేని సామాన్యుడు ‘నాకేమీ లేదు అం తా భగవానుడే’ అనుకుని నిశ్చింతగా ఉంటా డు. ఇతను ఇచ్చేది ఏమీ లేదు, ఆచరించేదీ ఏమీ లేదు. అంతా ఆయనే అనుకుని అన్నీ ఆయనకే వదిలిన వాడు గనుక భగవంతుడే ఆతని బాధ్యత వహిస్తాడు. అదే శరణాగతి. కనుక, అతడు నిశ్చింతగా మోక్షం పొందుతాడు. చీమకే సులువు, సామాన్యుడికే మోక్షం సులువు. ప్రపంచాన్ని రెండేళ్లనుంచి అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ వైరస్ అతిసూక్ష్మజీవి అనుకుంటే దానికెంత అహంకారం ఉండాలి?

అహంకార మమకారాలు తొలగిపోవాలి. తొలగించడానికి స్వామి అనుగ్రహం కావాలి. రాజ్యం స్వచ్ఛందంగా వదులుకున్న వారు రాముడు, బుద్ధుడు, భరతుడు. రాజ్యాన్ని ఆశ్రయించబోనని పోతన, అన్నమయ్య అహంకా రాలను వదిలించుకుని నారాయణుడిని ఆశ్రయించి ఆత్మజ్ఞానం సాధించి చరిత్రలో మిగిలి పోయిన అక్షర సంపన్నులు, మహానుభావు లు. శత్రురాశులు తమ బలాన్ని, అభిమానాన్ని కోల్పోయి నీ శరణుజొచ్చినారు, మేముకూడా దేహాత్మాభిమానాలను వదులుకుని భగవంతుని శరణాగతి చేస్తున్నామని ఈ 22వ పాశురంలో ఆండాళ్ వివరిస్తున్నారు.

పోతనమీద రాజద్రోహ నేరం 

ఈ పాశురం మనకు మన భక్తకవి బమ్మెర పోతనను గుర్తు చేస్తుంది. తన భాగవత కావ్యా న్ని రాజుకు అంకితం ఇవ్వాలని వత్తిడి తెస్తే, ని రాకరిస్తూ ‘కారే రాజులు, రాజ్యముల్ కలుగవే వారేరీ సిరిన్ మూటం గట్టుక పోవజాలిరే ...” అని బలి పాత్రద్వారా నిరసిస్తాడు పోతన.

ఆ యన చేసిన నేరం భాగవతాన్ని రాజుకు అంకి తం ఇవ్వక పోవడమే. ఆ కాలంలో ఒక చిన్నరాజ్యానికి ఉన్న రాజు ఒకాయన పోతన కా వ్యాన్ని బలవంతంగా లాక్కొని వెళదానుకుం టూ ఉంటాడు. అంతేకాదు, పోతనమీద రాజద్రోహం నేరం మోపి స్థిరచరాస్తులన్నీ స్వాధీ నం చేసుకుంటాడు. ఆ రాజుది అహంకారం. ఆ రాజు పేరుకూడా ఎవరికీ తెలియదు. ఆ దు రహంకారి అయిన రాజుకు పేరుగూడా లేదు కాని, పోతన భాగవతం ఈనాటికీ వెలుగుతూనే ఉంది.