calender_icon.png 13 September, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచర్ల కృష్ణారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక

13-09-2025 08:38:54 PM

చిట్యాల (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి(BRS Party State Leader Kancharla Krishna Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీలో శనివారం చేరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులై ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరారు. ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు కురుపటి లింగయ్య, కురుపాటి రామచంద్రం, ఇరుగు నరేష్, మట్టిపల్లి అంజయ్య, జనపాల లింగస్వామి, కోరబోయిన స్వామి, బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.