calender_icon.png 13 September, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు

13-09-2025 08:46:48 PM

ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి( MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. శనివారం హన్వాడ మండల కేంద్రానికి  చెందిన పెంటయ్య కుమార్తె దాసరి లక్ష్మమ్మ, హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులు నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి  రూ.2,50,000 మంజూరు చేస్తూ వచ్చిన ఎల్ఓసి లెటర్ ను హన్వాడ మండల కేంద్రంలో బాధితురాలు తండ్రి పెంటయ్యకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ నాయకులు సత్యం, రాములు , యాదిరెడ్డి, వెంకటయ్య, గంగపురి, రఘుపతి రెడ్డి, బొక్కి రాములు తదితరులు పాల్గొన్నారు.