calender_icon.png 13 September, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,11,000 విరాళం

13-09-2025 08:36:08 PM

ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డికి అందజేత..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Agricultural Advisor Pocharam Srinivas Reddy) కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సోదరుడు శంభురెడ్డి, కుమారుడు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు. నిజాంబాద్ జిల్లా బోధనకు చెందిన ఆచంపల్లి గ్రామానికి చెందిన కామెల్లి ప్రశాంత్, ప్రవళిక లు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,11,111 రూపాయలు విరాళంగా ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు లు విరాళం ఇచ్చిన భక్తులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు బీర్కూరు మండల ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.