calender_icon.png 13 September, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరికలు

13-09-2025 07:09:21 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ లు గొట్టం సంజీవ్ తో పాటు రాజాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు శనివారం బీజేపీలో చేరారు. వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు శెట్పలి విష్ణు, రాజాపూర్ బూత్ అధ్యక్షులు చంద్రపాల్, జనరల్ సెక్రెటరీ జాదవ్ పండరి, ముత్యం పిరాజీ, మాజీ మండలాధ్యక్షులు కిష్టారెడ్డి, మల్లికార్జున్ దేశాయ్ భాజపా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.