calender_icon.png 13 September, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ జిల్లా ఆటో దొంగల అరెస్టు

13-09-2025 08:34:03 PM

నాలుగు ఆటోలు స్వాధీనం..

వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్ లను అభినందించిన ఎస్పీ 

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆటోల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అంతర్ జిల్లా దొంగల ముఠా వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గేటు వద్ద వాహనాలను పోలీస్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా పోలీస్ సిబ్బందిని చూసి పారిపోతుండగా కానిస్టేబుల్ గంగారం హోంగార్డు బాలాజీలు వారిని వెంబడించి పట్టుకొని విచారించారు.

నిజాంబాద్ జిల్లా మంచిప గ్రామానికి చెందిన కుమ్మరి అలియాస్ కనుగుల రాజు, నిజాంబాద్ మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన కొల్ల దుర్గరాజు, ఇద్దరు మూటగా ఏర్పడి నాగిరెడ్డిపేటలో దొంగిలించిన ఆటో మెదక్లో దొంగతనం చేసిన రెండో ఆటోలు బిక్కనూరులో దొంగతనం చేసిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రెండు లక్షల నలభై వేల విలువ గల నాలుగు ఆటోలను, రెండు మొబైల్ ఫోన్లను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా సమయస్ఫూర్తిగా వివరించిన ఎల్లారెడ్డి సిఐ బాల్ రెడ్డి, నాగిరెడ్డిపేట కానిస్టేబుల్ గంగారం, ఓం గాడు బాలాజీ లను ఎస్పీ అభినందించారు.