10-12-2025 01:38:57 AM
వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ‘నయనం’తో అలరించనున్నారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. ఇందులో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేథ్యంలో ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “నెరేషన్ వినగానే షాకింగ్‌లో ఉండిపోయా.
నయన్ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయిపోయా. చాలా రోజుల తర్వాత మంచి ప్రాజెక్టు చేశాననే సంతృప్తితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా” అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ నాకెంతో స్పెషల్. ఇందులో మాధవిగా కనిపించబోతున్నాన’ని ప్రియాంక జైన్ తెలిపారు. వితికాశేరు మాట్లాడుతూ “తెలుగులో అరుదుగా వచ్చే ప్రాజెక్ట్ ఇది” అని చెప్పారు.
డైరెక్టర్ స్వాతి ప్రకాశ్ మాట్లాడుతూ “పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సిరీస్” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రజినీ తాళ్లూరి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, జీ5 టీమ్, చిత్రబృందం పాల్గొన్నారు.