calender_icon.png 11 December, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటిపల్లి కుల్తా రైతులకు వ్యవసాయ కరెంట్ కనెక్షన్లు ఇప్పిస్తాం

11-12-2025 02:28:47 PM

సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్,(విజయక్రాంతి): కౌటాల మండలంలోని కుంబారి, తాటిపల్లి, మొగడ్ ధగడ్ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తొర్రెం దివాకర్, చందన్ ఖడే తిరుపతి, ఊర్వత్ జిజాబాయి బాజీరావు కు మద్దతుగా ప్రచారాన్ని  సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటిపల్లి కుల్తాలో సాగు చేసుకుంటున్న రైతులకు వ్యవసాయ కరెంట్ కనెక్షన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వాల్మీకి సమాజం యొక్క కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సామాజిక స్పృహ మరియు బాధ్యత ఉన్న అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ప్రలోభాలకు, డబ్బులకు లొంగవద్దని గ్రామస్తులను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో మండల ఇంచార్జి అరుణ్ లోయ, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, భాజపా సీనియర్ నాయకులు వాను పటేల్, బూర్ల రవి, ఎల్ములే మధుకర్, నౌగడే భావ్రావు, ధోని వెంకటేష్, పెద్ది హరీష్, చౌదరి సునీల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.