calender_icon.png 9 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు!

09-12-2025 01:18:12 AM

హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పు డు తమ ప్రేమకథలను బయట పెడుతుంటారు. తాజాగా అందాల భామ రాశి సింగ్ కూడా తన లవ్‌స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ఆహా ఓటీటీలో ‘3 రోజెస్’ సిరీస్ సీజన్2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాశి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నడిపిన ప్రేమాయణం గురించి  తెలిపింది.

“నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించా. అతను నా బాయ్‌ఫ్రెండ్. అందుకే కాలేజీలో నాకు చాలా ఫేవర్‌గా ఉండేవాడు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు క్వశ్చన్ పేపర్స్ తెచ్చిచ్చేవాడు. వైవాలో ఏమీ అడిగేవాడు కాదు. వైవా జరిగినప్పుడు మేమిద్దరం ఓ పది నిముషాలు అలా సరదా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవా ళ్లం.

అప్పుడు నా ఏజ్ 17. అప్పటికి అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నాడు. వాళ్ల భార్య కూడా ఫాలో అవుతుందనుకుంటా. అయితే, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు” అని తెలిపింది.