calender_icon.png 11 December, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాకర్‌ను ఢీకొట్టే జే డ్రైవ్

10-12-2025 01:40:22 AM

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ సినిమాను జెనూస్ మొహమద్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం లో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ నెల 12న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోం ది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను టీమ్ విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది.

ప్రజా మీడియా కార్పొరేషన్ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్‌లో స్థిరపడేందుకు సిద్ధమవు తుంటాడు. ఇంతలో అతని సంస్థ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి.  ఆ హ్యాకర్ ఎవరు..? జే అతన్ని పట్టుకున్నాడా.. లేదా? అనేదే సినిమా. ఈ చిత్రానికి సంగీతం: ఓషో వెంకట్; డీవోపీ: అభినందన్ రామానుజన్.