11-12-2025 02:30:47 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి తమ అభ్యర్థికి ఓటు వేయాలని సైగ చేసినట్లు స్థానికులు ఆరోపించడంతో పరిస్థితి గొడవకు దారితీసింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. సమస్య పెరగకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు గుంపులను చెదరగొట్టారు.