31-08-2025 12:23:07 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): అసెంబ్లీ స మావేశాల సందర్భంగా తొ లి రోజు వాయిదా పడిన త ర్వాత మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. తెలంగాణకు తాను హోంమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రమేయం లేకుండా తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడదని జోస్యం చెప్పారు. తాను హోంమంత్రినయ్యాక పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. పోలీసు వ్యవస్థను రాజకీయ నా యకులు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.