calender_icon.png 31 August, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోడను ఢీకొట్టిన పెండ్లి బస్సు

31-08-2025 12:23:30 AM

  1. డ్రైవర్ దుర్మరణం 
  2. మహబూబాబాద్ జిల్లాలో ఘటన

మరిపెడ, ఆగస్టు 30 (విజయక్రాంతి): రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడను అదుపు తప్పి బస్సు ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఖమ్మం జాతీయ రహదారిపై దంతాలపల్లి వద్ద శనివారం రాత్రి జరిగింది. వరంగల్‌కు చెందినవారు ఖమ్మంలో జరిగి న వివాహానికి ప్రైవేటు బస్సులో వెళ్లి శనివా రం రాత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

శనివారం రాత్రి 9 గంటల ప్రాం తంలో దంతాలపల్లి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడను ఢీ కొట్టిం ది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దేవేందర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి, దంతాలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.