10-02-2025 01:28:03 AM
అశేషంగా హాజరైన భక్తజనం
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 9 ః శ్రీశైల మహాక్షేత్రంలో స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం శ్రీశైలం ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా చేపట్టిన ఈ రథోత్సవ కార్య క్రమంలో అశేష జనం హాజరై కోలాటాలు, డప్పు చప్పుడు మంగళ వాయిద్యాలతో శ్రీశైల క్షేత్రం భక్తి భావంతో మార్మోగింది.
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వా మి అమ్మవార్లకు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక పూజలు అనంతరం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించారు.
శివనామసంకీర్తన (భజన), గిరిజన చెంచు నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకు న్నాయి. ఈ స్వర్ణోత్సవ ఊరేగింపు కార్యక్ర మంలో అసిస్టెంట్ కమిషనర్ ఈ.చంద్ర శేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎం.నర సింహారెడ్డి, అర్చకస్వాములు, వేదపండితు లు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్ష కులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.