calender_icon.png 2 January, 2026 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు అండగా ఉంటా

02-01-2026 01:40:50 AM

ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి 

కుషాయిగూడ, జనవరి 1 (విజయక్రాంతి) : జర్నలిస్టులకు అండగా ఉంటానని ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి టిడబ్ల్యూజేఎఫ్ నాయకులతో అన్నారు. నూ తన సంవత్సరాన్ని పురస్కరించుకుని గు రువారం ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ఉన్న జర్నలిస్టులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. టిడబ్ల్యూ టజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, మేడ్చల్ జిల్లా కోశాధికారి మధు యాదవ్,  ఉపాధ్యక్షులు జి రోజారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి రజినీకాంత్ గౌడ్, కె మహేందర్, కె బాలకృష్ణ బబ్బి పాల్గొన్నారు.