02-01-2026 01:41:25 AM
యాదగిరిగుట్ట, జనవరి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఈవో ఎస్ వెంకట్రావు తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభు త్వం ఆమోదించింది. గతంలో ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత గతేడాది ఆగస్టు 31న తెలంగాణ ప్రభు త్వం యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది. అయితే వ్యక్తిగత, అనారోగ్య కారణాల దృష్ట్యా రాజీనామా చేసినట్లు వెంకట్రావు తెలిపారు.
మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో విభేదాలే ప్రధాన కారణం అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని గమనించిన ప్రభుత్వం ఆలయ పరిపాలనలో అవసరమైన మార్పులు చేపడతున్నట్లు సమాచారం. దీంతో యాదగిరిగుట్ట ఆలయ కార్యక్రమాల కొనసాగింపు, భక్తుల సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.