calender_icon.png 2 January, 2026 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం

02-01-2026 12:36:11 AM

తెరపైకి చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల ప్రతిపాదన

మున్సిపల్‌లో మొదలైన  రాజకీయ సందడి

రిజర్వేషన్లపైనే అందరి దృష్టి 

పాత రిజర్వేషన్ల ప్రకారం 

జనవరి 10న వార్డుల వారీగా తుది జాబితా విడుదల

నేరుగా చైర్మన్ ఎన్నిక ప్రతిపాదన..

రంగారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలను పూర్తి చేయాలని యోచనలో ప్రభుత్వం క్షేత్రస్థాయిక షరతులు ప్రారంభించింది దానిలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఓటరు జాబితాక ముసాయిదాకు సం బంధించిన షెడ్యూలు వెల్లడించింది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడ్డట్టు అయింది.

ఇటీవల పల్లె పోరు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా కానీ వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరతులు ప్రారంభించి షెడ్యూలు విడుదల చేసింది. 2019 మున్సిపల్ యాక్టివ్ ప్రకారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ప్రాథమిక హక్కులు ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు ఈసీ సమాయత్తం అవుతోంది. జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పాలకవర్గం పదవీ కాలం ముగిసి 11 నెలలు.

 రంగారెడ్డి జిల్లాలో 15 మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఉండగా ఇటీవలనే 8 మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రంగారెడ్డి జిల్లాలో మిగిలిన ఎడి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కొత్తూరు మున్సిపాలిటీకి పాలకవర్గం కడుగు తీరకపోవడంతో మిగతా 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెల లు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువ డ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జన వరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలటి లకు ప్రత్యేక పాలన కొనసాగుతుంది.

 ప్రభుత్వం ఈ దఫా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చూడు తున్నట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఎన్నుకునేలా మున్సిపల్ ఎన్నికల చట్టసవరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునేలా విధానంపై దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధానం వల్ల మున్సిపాలిటీ చైర్మన్ లకు పాలనలో పారదర్శకత మరింత స్వేచ్ఛ ఇచ్చేలా, వారిలో జవాబుదారితనం పెరుగుతుందని అధికారులు వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులు సిఫార్సులు చేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే  వెళ్లడవుతుంది.

అంతర్గత సర్వేలు...

 మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్ బిజెపిలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి పార్టీ బలాల పైన లెక్క లు కడుతున్నారు.  పట్టణాల్లో ప్రజల్లో మం చి ఆదరణ ఉన్న వారిని రంగంలోకి దింపాలని వ్యూహాలు పన్నుతున్నారు.  ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరిలో పూర్తి చేయాలని కృతనిచ్చే ఉండడంతో దానికి అనుగుణంగా అధికారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రారంభించారు.

మున్సిపాలిటీ వారిగా  2019 నుండి ఓటర్ల వివరాలు ఇలా..

ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులు, 18 పోలింగ్ స్టేషన్లు ఉండగా 8475 పురుషులు, 8509 మహిళలు  మొత్తం 16,984 ఓటర్లు, చేవెళ్ల  మున్సిపాలిటీలో 18 వార్డులో 37 పోలీస్ స్టేషన్లో 12,579 పురుషులు,12,791 మహిళలు ఇతరులు ఒకటి మొత్తం 25,371 ఓటర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులో 12,741 పురుషులు 13,2502 మహిళలు 25,993 మొత్తం ఓటర్లు, షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా  26,679 పురుషులు 26,723 మహిళలు, ఇతరులు 1 మొత్తం ఓటర్లు 53,402, శంకర్పల్లిలో మొత్తం 15 వార్డులు ఉండగా 30 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 10,551 పురుషులు 10,850 మహిళలు మొత్తం ఓటర్లు 21,401,మొయినాబాద్ మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డులు ఉండగా 16,419 పురుషులు,16,402 మహిళలు, ఇతరులు 1 మొత్తం 32,822 ఓటర్లు ఉన్నారు.