calender_icon.png 2 January, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విస్ బార్‌లో భారీ పేలుడు

02-01-2026 12:57:04 AM

40మంది మృతి.. 100మందికి పైగా గాయాలు

బాణసంచా పేల్చడంతోనే ప్రమాదమని అనుమానాలు?

ప్రమాద సమయంలో వందలాది మంది ఉన్నట్లు నివేదికలు

బెర్న్, జనవరి 1:  స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు విషా దాంతమయ్యాయి. సియెర్రో క్రాన్స్ మోంటానాలోని స్కై రిసార్ట్‌లోని ఓ బార్లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు సంభవించి 40మంది మృతిచెందగా 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. న్యూఇయర్ వేడుకల కో సం భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలోనే ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 1.30గం. సమయంలో లె కాన్‌స్టెలేషన్ బార్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభ వించింది.  సమాచారం అందుకున్న ఫైర్ సి బ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మంట లను అదుపు చేశారు. హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. భ ద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని. బాధితుల బంధువుల కోసం ప్రత్యేక హెల్ప్‌లై ఏర్పాటు చేశారు.

బార్‌లో వందలాది మంది..

పేలుడు సమయంలో బార్‌లో వంద మంది ఉన్నారని అధికారులు అంటున్నారు. అయితే.. అంతకు మించే జనం గుమిగూడారని స్విస్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. బార్‌లోని బేస్‌మెంట్‌లోనే 400 మంది ఉన్నారని నివేదికలు ఇస్తున్నా యి. దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.

బాణసంచా పేల్చడంతోనే?

అయితే బార్‌లో కాల్పులు, పేలుడు సంభవించినట్లు తొలుత కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ ప్రమాదం కాల్పుల వల్ల జరగలేదని, బాణసంచాపేలి ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. దుర్ఘటనపై కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. స్విస్ వార్తా సంస్థ బ్లిక్ ప్రకారం.. కచేరీ సమయంలో కాల్చిన బాణసంచా పేలి మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని కథనాల్లో పేర్కొంది.