31-10-2025 12:00:00 AM
 
							హనుమకొండ టౌన్ అక్టోబర్ 30 (విజయక్రాంతి): ముంతాజ్ తుఫాన్ తో బుధవారం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరడంతో గురువారం ఉదయం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి అన్నంప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందించడం జరిగిందని తెలిపారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను పునరావస కేంద్రాలను తరలించామని అన్నారు.