03-09-2025 01:15:43 AM
సనతనగర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొ రేటర్ శేషుకుమారి జన్మదిన వేడుకలు జరిగాయి. మొదటగా బల్కంపేట్ యెల్లమ్మమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు పాల్గొని ఆమెకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయం లో జరిగిన అభిషేకం, అలంకరణలు, సత్కారం భక్తి వాతావరణాన్ని మరింత ప్రత్యేకం చేశాయి.తరువాత నగరంలోని అముక్తమాల్యద హోటల్లో జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి.
పూలదండలతో, శుభాకాంక్షలతో, కేక్ కటింగ్తో వేడుక సందడి వాతా వరణంలో సాగింది. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్నేహితులు, అభిమాను లు విస్తృతంగా హాజరయ్యారు. ముఖ్యంగా సంతోష్ మణికుమార్, కూతురు నరసింహ, హనుమంతరావు, బాలరాజ్, ప్రభుగౌడ్, లక్ష్మీ బాసలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మా ట్లాడిన నా యకులు శేషుకుమారి సేవాభావాన్ని కొనియాడారు.
ఆమె కార్పొరేటర్గా పనిచేసిన కా లంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల మదిలో నిలిచిపోయాయని గుర్తు చేశారు. భవిష్యత్లో మరింత పెద్ద స్థాయిలో ప్రజా సేవలు చేయాలని ఆకాంక్షించారు.కేక్ కట్ చేసిన అనంతరం అతిథులు శుభాకాంక్షలు తెలియజేయగా, హాజరైన వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వేదికను పూలతో అలంకరించడం, రంగుల వెలుగులతో శోభాయమానం చేయడం వేడుకలకు మరింత ఆకర్షణను తెచ్చింది.