calender_icon.png 17 December, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవికి 12 రోజుల కస్టడీ

17-12-2025 01:50:20 AM

  1. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

4 కేసుల్లో విచారణకు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి) ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలుమార్లు విచారణ ఎదుర్కొన్న రవిని.. మరింత లోతుగా ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. అతనిపై నమోదై న 4 వేర్వేరు కేసుల్లో విచారణ నిమిత్తం ఏకం గా 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రవిపై నమోదైన ఒక్కో కేసులో 3 రోజుల చొప్పున, మొత్తం 4 కేసులకుగాను 12 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది.

దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని తమ అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. రెండేళ్ల క్రితం నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ సోషల్ మీడి యా వేదికగా రవి పోలీసులకే సవాల్ విసిరా డు. దీనిని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. పక్కా ప్రణాళికతో అతడిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి ద్వారానే ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వ్బుసైట్లను బ్లాక్ చేయించడం గమనార్హం. విదేశాల్లో ఉంటూ వంద కుపైగా పైరసీ వ్బుసైట్లను నడిపిన రవి.. ఈ అక్రమ దందా ద్వారా సుమారు రూ. 20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతడి బ్యాంకు ఖాతాల్లోని రూ. 3 కోట్లను ఫ్రీజ్ చేశారు. 

ఫ్రాన్సులో తలదాచుకున్న రవి.. విడాకుల వ్యవహారం చక్కబెట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చాడు. ఇదే అదనుగా భావించిన పోలీసులు నెల రోజుల పాటు అతడిపై నిఘా ఉంచి అరెస్ట్ చేశారు. రాబోయే 12 రోజుల కస్టడీలో.. పైరసీ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, విదేశాల నుంచి నిధులు ఎలా మళ్లించారు, అనే కోణంలో పోలీసులు కూపీ లాగనున్నారు.