17-12-2025 01:53:55 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్ విస్తరణను బీజేపీ వ్యతిరేకిస్తుందన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు చెప్పారు. జీహె చ్‌ఎంసీలో విలీనమయ్యే ప్రాంతాలకు చెందిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనాయకులతో మంగళవారం పార్టీ కార్యాలయంలో రాంచందర్‌రావు సమావేశమై వారికి దిశానిర్దేశం చేశా రు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అభివృద్ధి పూర్తిస్థాయిలో లేకపోవ డం, ఇరుకైన వీధులు, తాగునీటి సౌకర్యాల కొరత, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండ డం వల్ల మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.
ఇలాంటి పరిస్థితు ల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియతో కొత్తగా విలీనం అయ్యే ప్రాంతాల ప్రజలపై పన్నుల భారం పెరగుతుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసంబద్ధమైనదని,అశాస్త్రీయమైందన్నారు.ప్రజావిరోధి నిర్ణయానికి వ్యతిరేకంగా బాధిత ప్రాం తాల ప్రజలతో కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భౌగోళికంగా జరిగే రాజకీయ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండి, బీజేపీ కార్యకర్తలందరూ సమష్టి పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు.
కొండగట్టు ఆలయానికి నోటీసులా...
కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాంచందర్‌రావు అన్నా రు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్మానికి ప్రతీకైన కొండగట్టు అంజన్న ఆలయంపై ఈ తరహా చర్యలు హిందూ భక్తుల విశ్వాసాలపై దాడిగా బీజేపీ భావిస్తోందన్నా రు. ఆలయానికి, ఆలయ ఆవరణలో 6 ఎకరా ల భూమి పరిమితి అంటూ కొత్త వాదనను తీసుకురావడం భక్తులకు బాధను కలిగిస్తోందన్నారు.
అటవీ శాఖ క్లెయిమ్ చేస్తున్న 6 ఎకరా ల స్థలంలోనే భక్తులకు అత్యంత అవసరమైన అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, ఆగమ పాఠశాల, వేద విద్యార్థుల వసతి గృహం, భోజనశాల వంటి కీలక మౌలి క సదుపాయాలు ఉన్నాయని, మరోవైపు ఎండోమెంట్ కూడా అటవీ శాఖకు నోటీసు లు ఇచ్చిందన్నారు.
కొం డగట్టు వద్ద 6 ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా రాం సాగర్‌లో ఉన్న దేవాదాయ భూ ముల నుంచి 8 ఎకరాలు ఇవ్వడానికి ఎండోమెంట్ శాఖ ముందుకు వచ్చినా, అటవీ శాఖ కొండగట్టు ఆలయం పరిధిలోనే వివాదాన్ని కొన సాగించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనేక అ నుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మేయర్ పీఠం గెలవాలి
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేయర్ స్థానం భారతీయ జనతా పార్టీ గెలవాలని, అందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని రాం చందర్ రావు కోరారు. స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని, మార్పులకు అనుగుణంగా నాయకులు కూడా మారుతూ ప్రజలు మన వైపు వచ్చేలా పనిచేయాలని సూచించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఆదరించారని పేర్కొన్నారు.
భౌగోళికంగా డివిజన్ విస్తరణ ఎలా ఉందో చూసుకోవాలన్నారు. అందరూ కలిసి పనిచేయాలని, గొడవలు పెట్టుకుంటే పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని, కష్టపడే వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.