calender_icon.png 31 December, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలకు ఐడీబీఐ ‘లక్ష’ణమైన సాయం

31-12-2025 01:37:29 AM

మణికొండ, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ సంస్థలు అండగా నిలిచినప్పుడే విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మణికొండ ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల పేర్కొన్నారు. మంగళవారం ఐడీబీఐ బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలకు ఒక లక్ష రూపాయల విలువైన ఫర్నిచర్ను అందజేసింది.

ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంక్ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.పాఠశాల మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఐడీబీఐ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ విశ్వనాథ్ ప్రభు, బ్యాంక్ మేనేజర్ జయకుమార్, అఖిలేష్, జై సింగ్ విచ్చేశారు. విద్యార్థులకు కంప్యూటర్ టేబుల్స్, ఐదు లైబ్రరీ రాక్స్, ఆరు ఆఫీసు టేబుల్స్, మూడు కుర్చీలను అందజేశారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు, లైబ్రరీలో పుస్తకాలను భద్రపరుచుకునేందుకు ఈ వస్తువులు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు.

ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి ఐడీబీఐ బ్యాంక్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.