calender_icon.png 31 December, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్‌ల బదిలీలు

31-12-2025 01:37:04 AM

జీహెచ్‌ఎంసీలో నూతన అధికారుల నియామకం

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిం ది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొడ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను నల్లగొండ కలెక్టర్‌గా నియమించారు. 

జీహెఎంసీకి కొత్త సారథులు

జీహెచ్‌ఎంసీ నగరంలోని క్యూర్ ప్రాం తాన్ని కాలుష్య రహితంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణ యించిన నేపథ్యంలో అనుభవజ్ఞులైన అధికారులకు జోనల్ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా ఉన్న జి సృజనను జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. ఆమెకు కీలకమైన కూకట్‌పల్లి, శేరిలింగంప ల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలు అప్పగించారు.

నిజామాబాద్ కలెక్టర్‌గా ఉన్న టి వినయ్ కృష్ణారెడ్డిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ.. మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల పర్యవేక్షణ బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే మహిళా శిశు సం క్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజాకు.. సృజన స్థా నంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అ ప్పగించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న ఉమా శంకర్ ప్రసాద్‌ను నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా నియమించారు. గతంలో ఇక్కడ నారాయణ్ అమిత్ మాలెంపాటిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.