calender_icon.png 21 September, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇడ్లీకొట్టు.. ఊరికి గుండెకాయ

21-09-2025 01:14:01 AM

స్టార్ హీరో ధనుష్ నుంచి వస్తున్న ద్విభాషాచిత్రం ‘ఇడ్లీకొట్టు’. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న సినిమా.. డైరెక్టర్‌గా ధనుష్‌కు నాలుగోది. నిత్యామీనన్ ఈ సినిమాలో రెండోసారి ధనుష్‌తో హీరోయిన్‌గా నటిస్తోంది. షాలిని పాండే ఇందులో మరో కథానాయిక. అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే, పల్లేపట్నం.. రెండు చోట్లా కథ సాగుతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ ఇందులో రెండు వెరియేషన్స్‌లో కనిపించారు. ‘ఆ ఇడ్లీ కొట్టంటే మా ఊరోళ్లకు సెంటిమెంట్ సార్..’, ‘దమ్మిడీకి పనికిరాని వాళ్ల నాన్న ఇడ్లీకొట్టు కోసం వాడు చావడానికైనా సిద్ధమయ్యాడు..’ ‘ఇడ్లీ వేయడానికే నేను పుట్టానపిస్తుంది..’ ‘ఉట్టి కొట్టు అనుకోమాకా.. ఈ ఊరికి గుండెకాయ..’ అంటూ సాగే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను శ్రీవేదాక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి  తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: కిరణ్ కౌశిక్; యాక్షన్: పీటర్ హెయిన్; ఎడిటర్: జీకే ప్రసన్న; ఆర్ట్: జాకీ.