21-09-2025 01:15:41 AM
మలయాళీల లాలెట్టన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక ఎక్స్ ఖాతాలో ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు ప్రకారం భారత ప్రభు త్వం మోహన్‌లాల్‌కు 2023 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటిస్తోంది’ అని తెలిపింది. మోహన్‌లాల్ అసాధారణ సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొం ది. భారతీయ సినిమాకు మోహన్‌లాల్ అందించిన సేవలను గుర్తిస్తూ 2023 సంవత్సరానికి గానూ కేంద్ర సర్కార్ ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌కు ఈ అవార్డును అందజేస్తారు.
ఇదీ సినీప్రస్థానం..
మోహన్‌లాల్ మల్లయుద్ధం నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. రెండు సార్లు కుస్తీ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన మలయాళీల లాలెట్టన్ ఆయన. ఎట్టన్ అంటే మలయాళంలో ‘అన్న’ లేదా ‘పెద్దన్న’ అని అర్థం. అందుకే మోహన్ లాల్‌ను ఆయన అభిమాను లు ముద్దుగా ‘లాల్ ఎట్టన్’ అని పిలుచుకుంటారు. ఆయన అస లు పేరు మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్. ఆయన ఆరో తరగతిలోనే నటనారంగంలోకి ప్రవేశించారు. ఒక నాటకంలో 90 ఏళ్ల వృద్ధుడిగా నటించి ప్రశంసలు పొందారు. 1978లో స్నేహితులు తీసిన ‘తిరనోట్టమ్’ చిత్రంలో ఆయన తొలిసారి నటించగా, అది విడుదలకు నోచుకోలేదు.
ఆ తర్వాత స్నేహితుల బలవంతపెట్టడంతో ఆడిషన్‌లో పాల్గొన్న ఆయన ‘మంజిల్ విరింజ పూక్క ల్’లో ప్రతినాయక పాత్రకు ఎంపికయ్యారు. భారీ విజయం సాధించిన ఆ సినిమానే మోహన్‌లాల్ సినీ కెరీర్‌కు పునాదిగా మారింది. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. 40 ఏళ్లుగా 400లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన నటన, బహుముఖ పాత్రల ఎంపికతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ‘కిరీడం’, ‘దృశ్యం’, “వనప్రస్థం’, ‘చంద్రలేఖ’, ‘నరసింహ’, ‘పులి మురుగన్’, ‘లూసిఫర్’, ‘ఎల్2: ఎంపురాన్’, ‘తుడరుమ్’, ‘హృదయ పూర్వం’, తెలు గులో ‘జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ముఖ్యమైనవి. ఆయన నటిస్తున్న తాజాచిత్రం ‘వృషభ’ విడుదలకు సిద్ధం గా ఉంది.
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మాలయాళ చిత్రం గా నిలిచిన ‘పులి మురుగన్’ ఆయన సినిమా కావటం విశేషం. ‘లూసిఫర్’ రూ.200 కోట్ల వసూళ్లు సాధించించగా, ఈ ఏడాది విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్’ ఏకంగా రూ.265 కోట్లు సాధించిపెట్టింది. సినిమాల్లోకి మారిన తొలినాళ్లలో ఒక సినిమా పూర్తయ్యేదాకా మరో చిత్రానికి సంతకం చేసేవారు కాదు. తర్వాతి కాలంలో అందరిలాగే ఆయన షెడ్యూల్‌లోనూ మార్పులు వచ్చా యి. 1986లోనైతే ఏకంగా 36 సినిమాలు చేశారు. జూ.ఎన్టీఆర్, విజయ్, విశాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఈతరం కథానాయకులతోనూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఏమా త్రం సంకోచించలేదు కాబట్టే పరభాషా చిత్రపరిశ్రమల్లోనూ అభిమానులను సంపాదించుకోగలిగారు.
ఆరు జాతీయ అవార్డులు సొంతం
మోహన్‌లాల్ నటనా ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, తొమ్మిది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వచ్చాయి. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా పొందారు. మోహన్‌లాల్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ ప్రతిభ చాటారు. 2021లో వచ్చిన ‘బరోజ్’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆయన స్థాపించిన ప్రాణవం ఆర్ట్స్, కాసినో ఫిల్మ్స్ నిర్మాణ సం స్థల ద్వారా వచ్చిన సినిమాలెన్నో విజయవంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
ప్రముఖుల అభినందనలు
మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించటం తో ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మోహన్‌లాల్‌తో దిగిన ఫొటోను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్న మోదీ.. ఆయన వైవిధ్యమైన నటనను ప్రశసించారు. మోహన్‌లాల్ మలయాళ సినిమాకు దివిటీలా నిలిచారని కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ విభిన్న పాత్ర లు పోషించారని, తద్వారా ఎంతో మందిలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నా రు. మరో మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా మోహన్‌లాల్‌కు అభినందనలు తెఇపారు. మోహన్‌లాల్ తనకు సోదరుడిలాంటి వార ని, ఆయన అద్భుత సినీప్రయాణానికి ఈ అవార్డు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సైతం అభినందనలు తెలిపారు.