11-12-2024 04:28:55 PM
ఛత్తీస్ గఢ్,(విజయక్రాంతి): బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గంగలూరు పరిధిలోని మూంగా ప్రాంతంలో బుధవారం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి డీఆర్జీకి చెందిన ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మంగ్లు కుడియం, యోగేశ్వర్ షోరి సైనికులకు ప్రధమ చికిత్స చేసి బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు. ఐఈడీ పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు.