24-09-2025 12:00:00 AM
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా టూత్‌పేస్ట్ నుంచి కార్ల దాకా 375కు పైగా వస్తువుల ధరల తగ్గాయి. గతంలో 5, 12, 18, 28 శా తంగా ఉన్న పన్ను రేట్లను 5, 18 శాతానికి పరిమితం చేయడంతో దా దాపు 99 శాతం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0 పే రుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం కలిగించినట్లయింది. జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల దేశంలోని రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, చిన్న, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దాకా సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరనుంది.
జీఎస్టీ తగ్గించడంతో దసరా, దీపావళి పండగ సీజన్ కావడంతో సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు, బట్టలు కొనేందుకు ఎగబడుతుండడంతో షాపింగ్‌మాల్స్ కలకలలాడుతున్నాయి. ఈ సంస్కరణలు చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ఆర్థికంగా ఊతమివ్వనుంది. ‘2017లో ప్రారంభమైన జీఎస్టీ.. ప్రజలు, వ్యాపార సంస్థలను బహుళ పన్నుల నుంచి విముక్తి కల్పించింది. తాజాగా సంస్కరణలు ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆవిష్కణకు దోహదపడతాయి. ఈ పండగ సీ జన్‌లో జీఎస్టీ ఆదా ఉత్సవాన్ని జరుపుకుందాం’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 విషయంలో భి న్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పుల వల్ల సామాన్యులకు ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది పెద్ద ప్రశ్న.
జీఎస్టీ సంస్కరణలు అ వసరమైనప్పటికీ బీజేపీ కాస్త ఆలస్యంగా తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలు (బీహార్, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్) దృష్టిలో ఉంచుకొని మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించేందుకు మోదీ సర్కార్ ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. మునుపటి కాంగ్రెస్ ప్ర భుత్వం ఈ పన్నులను విధించిందని, బీజేపీ ప్రభుత్వం నేడు సామాన్యులను వాటి నుంచి విముక్తి చేసిందని మోదీ ప్రచారం చేయడం గమనార్హం. అయితే దేశ వ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వ సూలు చేసేలా కేంద్రం 2017లో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన వి షయం తెలిసిందే. అయితే ఈ పన్నులను బీజేపీ ప్రభుత్వమే విధించిందని ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి.
దీనిని తమకు సా నుకూలంగా మలుచుకున్న బీజేపీ తాజాగా జీఎస్టీలో పన్ను శ్లాబులు తగ్గించడంతో పాటు వాటిలో రాయితీలు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజల చేత ప్రశంసలు అందుకోవాలని భావిస్తుంది. బాలాకోట్ స్ట్రుక్ మాదిరి ‘ఆపరేషన్ సిందూర్’ ఆ వాతావరణాన్ని సృష్టించలేకపోవడం.. ప్రతిపక్షాలు పదే పదే ‘ఓటు చోరీ’ సమస్యను లేవనెత్తడం..దీనిపై బీజేపీ ముక్తసరిగా స్పందించడం కనిపించింది.
అందుకే ఓటు చోరి అంశం మరిచిపోయేలా మధ్యతరగతి ఓటర్లకు మరింత దగ్గరయ్యేందుకే జీఎస్టీ సంస్కరణల పే రుతో ఆర్థిక ఉపశమనం కంటే రాజకీయ లక్ష్యాలను సాధించే దిశగా తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతిమంగా జీఎస్టీ సంస్కరణలతో స్వదేశీ పారిశ్రామిక విధానానికి ఆర్థిక ఉపశమనం అందించడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ 2.0ను తీసుకొచ్చి మధ్యతరగతికి మరింత దగ్గరైనట్లుగా అనిపిస్తుంది.