calender_icon.png 15 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలన్ హీరోగా మారితే అహో!

29-08-2024 12:00:00 AM

‘మగధీర’ సహా పలు దక్షిణాది చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన దేవ్ గిల్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహో! విక్రమార్క’. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పనిచేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ క్రమం లో చిత్ర దర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన సంగతులి వీ.. “మగధీర’కు కో డైరెక్టర్‌గా పనిచేసిన టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయమైంది. హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం పనిచేస్తున్న టైంలో దేవ్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు.

విలన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకున్నాం. చివరకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే బాగుంటుందని ఈ కథను ఖాయం చేశాం. విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేసిన వర్మ ఈ కథను అద్భుతంగా రాశారు. దేవ్ గిల్ తన ఇన్‌పుట్స్ కూడా ఇస్తుండేవాడు. ఇందులోని పోలీస్ ఆఫీసర్ ఆంధ్రా నుంచి పుణెకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అలా ఈ కథను అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుందనేదే కథ. హీరోయిన్‌దీ ప్రాధాన్యమున్న పాత్రే. ఇందులో కథానాయిక ఓ లెక్చరర్. తెలుగమ్మాయైతే బాగుంటుందని చిత్రా శుక్లాను తీసుకున్నాం” అని వివరించారు.