calender_icon.png 15 July, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలితో తమిళంలోకి..

29-08-2024 12:00:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కూలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపాయి. కూలీ పని చేసుకొని బతికేవాడు గోల్డ్ మాఫియా సామ్రాజ్యంలోకి వెళ్లి అక్రమార్కులను భరతం పట్టేవాడిలా రజనీ గ్లింప్స్ గతంలో ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లలో పలు సన్నివేశాలు తెరకెక్కించిన మేకర్స త్వరలో మూడో షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంభించనున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమా కు సంబంధించి క్యారెక్టర్లను అనౌన్స్ చేసే కార్యక్రమానికి సైతం చిత్రబృందం తెర తీసింది.

తాజాగా బుధవారం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ ఇందులో దయాల్ అనే పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటిస్తూ ఆయన లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ నటి రచిత రామ్ ఎంపికైందనేది తాజా వార్త. తమిళంలో ఇదే ఆమెకు మొదటి సినిమా. రచిత రామ్ అసలు పేరు బింధియా రామ్. రచిత అనే స్క్రీన్ నేమ్‌తో కెరీర్ ఆరంభించిన ఆ కన్నడ కుట్టి అక్కడ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరుగా పేరుగాంచింది.