25-07-2025 12:10:58 AM
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ సవాల్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రా జీనామా చేసి బలహీనవర్గానికి చెం దిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ సవాల్ విసిరారు. బీసీలపై ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తున్న రేవంత్‌రెడ్డి.. బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందనే అంశంపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని.. దీనిపై రేవంత్‌రెడ్డికి దమ్ముం టే స్పందించాలన్నారు. 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా బీసీ వ్యక్తిని ప్రధానిగా చేయలేదని, ఒక్కసారైనా బీసీలకు రాష్ర్టపతి అయ్యే అవకాశం కల్పించలేదన్నారు. ఉమ్మడి ఏపీలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి కూడా బీసీని సీఎం చేయలేదన్నారు.
రాష్ర్ట జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నా.. రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించారా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు అన్యాయమే జరిగిందని.. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు బీసీల గురించి మొసలికన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు.