25-07-2025 12:12:58 AM
శ్రీ రామ ల్యాండ్ మార్క్ లో సాయి స్వాస్థ్య ఆరోగ్య కేంద్రం ఆవిష్కృతం
సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం : బెక్కరి రాంరెడ్డి, శ్రీ జయ రామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
మహబూబ్‌నగర్ జూలై 2౪ (విజయ క్రాంతి) : ప్రతి వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనది సంపూర్ణ ఆరోగ్యం. ఏది సాధించా లన్న ఎంతటి ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆరోగ్యం పదిలంగా ఉంటేనే సాధ్యం. ప్రైవే టు ఆస్పత్రుల వైపు ఒక్కసారి చూస్తే ఎవరైనా తమ జేబుల్లో డబ్బు ఉందో చెక్ చేసు కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అందరికంటే పై ఎత్తులో ఉండాలి అ నుకునేవారు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. సంపాదించిన దాంట్లో కొంతైనా పేదలకు సహాయం చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది. పేదలకు, ధనవంతులకు ఎవరికైనా అతిముఖ్యమైంది ఆరోగ్యం.
డ బ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉండి ఆరో గ్యం బాగా లేని వారికి తాము బాధ్యత తీసుకుంటామంటూ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ నూతన విధానాలకు శ్రీకారం చుట్టుతూ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది.
ఉచిత సేవలు.. సంపూర్ణ ఆరోగ్యం
చిన్నపాటి తలనొప్పిగా ఉన్న అందిన కాడికి లాక్కునే ఈ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని తపనతో శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ అడుగులు వేసింది. చిన్నపాటి వైద్యసేవలే కాదు శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీర్వాదంతో శ్రీ మధుసూదన సాయి వారి సౌజన్యంతో ఎంతటి పెద్ద రోగానికైనా మేము నయం చేసే మందును అవు తామంటూ వైద్య సేవలు అందిస్తున్నారు.
దీర్ఘకాలిక రోగాలతో పాటు చలి, జ్వరం ఇలా వివిధ రోగాలకు సైతం అవసరమైన వైద్య సేవలు అందిస్తూ ఆరోబించిన తక్కువ సమయంలోనే సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆరోగ్య కేంద్రం అందరి మండలాలు పొందుతుంది.
తిరుగులేని విజయం వారి సొంతం
అతి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వ్యాపారులకు, వినియోగ దారులకు నమ్మకం అనే ఒక పునాదిని ఆవిష్కృతం చేసి విజయ్ తీరాలకు చేరిన శ్రీజ యరామ మోటార్స్ చైర్మన్ బిక్కరి రాంరెడ్డి పేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని తపనతో నూతన విధానాలను ఆవిష్కృతం చేస్తూ అడుగులు వేస్తున్నారు.
శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్, శ్రీ జయ రామ చారిటబుల్ ట్రస్ట్‌లు సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామ ల్యాండ్ మార్క్, హ స్నాపూర్ రోడ్డు దగ్గర సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆరోగ్య కేంద్రాన్ని ఆవిష్కృతం చేశారు. ఇక్కడ వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందిస్తూ పేదల మన్ననలు పొందుతున్నారు.
వైద్య సదుపాయాలకు సంప్రదించండి
సాయి స్వాస్థ్య వెల్ నెస్ సెంటర్ ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్యం బాగాలేని వ్యక్తులు ఒక మారు సంప్రదించి చూస్తే ఎంతటి విలువైన వైద్య సేవలు అందిస్తున్నారు ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆరం భించిన ఈ వైద్య కేంద్రానికి రోజుకు 60 నుంచి 70 మంది అనారోగ్యానికి గురైన వ్య క్తులు ఆశ్రయిస్తున్నారు.
ఇక్కడ ఉచితంగా అవసరమైన మందులను అందించడంతోపాటు ఉచిత రక్త, మూత్ర పరీక్షలను కూడా చేస్తారు. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు.
అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం
అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుంది. మందులు కూడా ఉచితం గా అందిస్తు న్నాం. శ్రీ జయరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ్ రెడ్డి ఎల్లప్పు డు మన దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా వెళ్లేలా చూడాలని చెబుతుంటారు. ఆ విధంగా నే వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
ఎవ్వరికి ఎలాం టి ఇబ్బందులు లేకుం డా నిరుపేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడం జరుగుతుం ది. కొన్ని పరీక్షలకు నిర్ణీత రుసుమును కూ డా తీసుకొని చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్క డ డాక్టర్ గా పని చేసినం దుకు నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది.
డాక్టర్ శ్రీకర్
ఆరోగ్యం అందిస్తే.. సరికొత్త జీవితాన్ని ఇచ్చినట్టే
ఎవరికైనా ఏది సహాయం చేసిన గుర్తు ఉం చుకుంటారో లేదో తెలియ దు. వారి ఆరోగ్యమే బాగా లే కుంటే ఆ సేవలను మనము కొంత ఖ ర్చయిన పరవాలేదు అనుకుంటూ అం దిస్తే వారి జీవితాంతం స్మరించుకుంటా రు. పేదలకు ఆరోగ్యాన్ని అందించిన సంతోషం కంటే ఇంక ఏముంటుంది. ఎ వరికో ఇబ్బందులు కలిగించాలని ఉద్దేశంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చే యలేదు.
నిరుపేదలకు సంపూర్ణ ఆరో గ్యం అందించాలనే సంకల్పంతోనే మా ట్రస్టు ద్వారా అవసరమైన వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. త క్కువ సమయంలోనే ఎంతోమంది వ చ్చి వైద్య సేవలు పొందుతున్నారు. మా ఆరోగ్యం బాగుంది అంటే ఈ జీవితానికి ఇక చాలు అనేంతల సంతోషం కలుగుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి.
బెక్కరి రాంరెడ్డి, శ్రీ రామ ల్యాండ్ మార్క్ చారిటబుల్ ట్రస్ట్, చైర్మన్