calender_icon.png 27 July, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

25-07-2025 12:10:03 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

కొత్తకోట జులై 24 : వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెం దే అవకాశం ఉంటుందని, నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్త కోట మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు.  ఈ.డి.డి రిజిస్టరు, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టరు పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రతి గర్భిణీ ఎ.ఎన్.సి నమోదు పక్కగా ఉండాలని సూచించారు. ప్రసవం రోజులు దగ్గరపడినప్పుడు ఆశావర్కర్లు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి చర్యలు తీసు కోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుచున్న సి. సెక్షన్ లు, అబార్షన్ల పై దృష్టి పె ట్టీ నియంత్రించాలని మెడికల్ సిబ్బందిని ఆదేశించారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా జలు బు, జ్వరంతో వచ్చే రోగులందరికీ డెంగ్యూ, మలేరియా వంటి రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వచ్చే జ్వరం కేసుల నివేదిక తీసుకొని వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తకోటలో గత సంవత్సరం డెంగ్యూ కేసులు ఎక్కువగా వచ్చాయని, వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూ చించారు.

ఫ్రై డే రోజు డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో నీటి నిల్వ లేకుండా, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. కొత్తకోట మున్సిపాలిటీలో బస్తీ దవాఖాన కొరకు భవనం చూడాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు.

కొత్తకోట పెబ్బేరు జాతీయ రహదారి మిరాసపల్లి వద్ద మహిళా సంఘాల పెట్రోల్ బంక్ కు స్థల పరిశీలనమహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయిస్తున్న నేపథ్యంలో కొత్తకోట పెబ్బేరు మధ్య మిరాస్ పల్లి వద్ద  జాతీయ రహదారి పై మహిళా సంఘాలకు పెట్రోల్ బం క్ ఏర్పాటు చేసుకునేందుకు స్థలం పరిశీలించారు.

జాతీయ రహదారి పై ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పెట్రోల్ బంక్ కు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వెంటనే డి.పి.ఆర్ సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ పి.డి ఉమాదేవి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాసులు, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. పరిమళ, మెడికల్ ఆఫీసర్, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి, సూపర్ వైజర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.