17-10-2025 12:00:00 AM
పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా
హాజీపూర్, అక్టోబర్ 16: హాజీపూర్ పోలీస్ స్టేషన్ ను గురువారం రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలనీ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
పోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టులు గురించి అడిగి తెలుసుకున్నారు.
రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్.ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు.