calender_icon.png 25 October, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు

12-11-2024 12:03:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా 2005 బ్యాచ్‌కు చెందిన కే ఇలంబర్తి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సి రావడంతో రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తికి ప్రభు త్వం జీహెచ్‌ఎంసీ ఎఫ్‌ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) బాధ్యతలు అప్పగించింది.

దీంతో గత నెల 17న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గాఅదనపు బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం ప్రభుత్వం చేసిన కలెక్టర్ల బదిలీల్లో రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలో ఉన్న ఇలంబర్తిని బదిలీ చేసి జీహెచ్‌ఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించారు.