11-10-2025 12:12:33 AM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు నుంచి నర్సంపేట వరకు పల్లె వెలుగు బస్సు సర్వీస్ ను కొత్తగూడెం, ఇల్లందు డిపో మేనేజర్ ఎస్.రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సర్వీస్ ప్రతిరోజు రెండు ట్రిప్పులు తిరుగుతుందని ఉదయం 7:00 గంటలకు మరియు 11:45 నిమిషాలకు ఉంటుందన్నారు. ఇల్లందు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ తెలిపారు.