calender_icon.png 11 January, 2026 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెర వెనుక అక్రమ నిర్మాణాలు

11-01-2026 12:05:10 AM

అడిగినంత ఇచ్చుకో... ఇష్టం ఉన్నట్లు నిర్మించుకో!

బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో టీపీఎస్ రాకేష్ కను సైగలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా

ఒక్కో అపార్ట్మెంట్ కు ఒక రేటు?

అక్రమ నిర్మాణాల లో అధికారుల ప్రమేయంపై ఏసీబీ ఆరా?

బండ్లగూడ జాగిర్, జనవరి (విజయక్రాంతి) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో బండ్ల గూడ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం అయినప్పటికీ గతంలో ఈ మున్సిపల్ కార్పొరే షన్‌లో అనుమతులు తీసుకున్న బిల్డర్ లు ఉన్న అనుమతుల కంటే అదనంగా భారీ భవంతులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరే షన్‌లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులే కారణమని చెప్పవచ్చు..? ఇంత పెద్ద మొత్తంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు ప్రైవేటు వ్యక్తుల మధ్య భవన నిర్మాణాల కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రైవేటు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది.

ఇక్కడ టిపిఎస్ గా పనిచేస్తున్న రాకేష్ అక్రమ నిర్మాణాల విషయంలో చూసి చూడనట్లుగా వ్యవ హరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ తో పాటు టిపిఎస్ కూడా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లకు మున్సిపల్ అధికారులకు మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచినట్లు ఆరోపణలు గుప్పు మంటున్నాయి. పత్రికల్లో అక్రమ నిర్మాణాలపై వార్తలు రాగానే టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్లకు పలు సూచనలు చేస్తూ భారీ భవన నిర్మాణాల చుట్టూ పరదాలు కట్టి లోపటే బయటికి కనిపించకుండా నిర్మాణాలు చేసుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది..

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో కొనసాగిన ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎసిబి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఇందులో అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది ఇందులో ఎంత మొత్తం ప్రైవేట్ లావాదేవీలు జరిగాయి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. టౌన్ ప్లానింగ్ లో పనిచేసే ఒక అధికారి చిక్కడు దొరకడు అన్న చందంగా తన పనితీరు ఉన్నది..

ఫోన్‌లో స్పందించని డిప్యూటీ కమిషనర్, టిపిఎస్

బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డిని వివరణ కోరెందుకు ఫోన్ చేయగా ఆయన ఫోన్‌లో స్పందించలేదు.. టిపిఓ రాకేష్‌కు ఫోన్ చేయరా తాను ఫీల్డ్‌లో ఉన్నానని ఫోన్‌లో వివరణ ఇవ్వకపోగా ఆఫీసుకు వచ్చి వివరణ తీసుకోవాలని తెలిపారు..